బాబూ జగ్జీవన్ రాంకు ఘనంగా నివాళులు

– శ్రద్ధాంజలి ఘటించిన కలెక్టర్
నవతెలంగాణ – కంటేశ్వర్
దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ  జయంతి వేడుక నిర్వహించారు.  ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ కమాన్ వద్ద గల జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాత అంబేడ్కర్ భవన్ లో జరిగిన కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరందు, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిణి శశికళ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరై డాక్టర్ బాబూ జగ్జీవన్ రాంకు శ్రద్ధాంజలి ఘటించారు.
Spread the love