క్షత్రియ మహిళ ఉపాధ్యాయులకు సన్మానం

నవతెలంగాణ-ఆర్మూర్ : క్షత్రియ మహిళా మండలి ఆధ్వర్యంలో  పట్టణంలోని క్షత్రియ మహిళా మండలి ఆధ్వర్యంలో క్షత్రియ కులస్తులైన మహిళా ఉపాధ్యాయులకు మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, కౌన్సిలర్ సంగీత ఖాందేశ్ లు పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.  పట్టణంలోని క్షత్రియ మినీ ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షత్రియ కులానికి చెందిన బాదాం శ్యామల, షికారి కమల, పడాల్ మమత, లక్ష్మీ బాయి, చందు వనిత, చౌల్ సంగీత, బచ్చేవాల్ గీత, అల్జాపూర్ రేణు, గటడి స్వాతి, పవార్ అంబికా, రంజిత, బొచ్కర్ లత లను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పండిత్ వినీత, సంగీత ఖాందేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదన్నారు. అనేకమంది విద్యార్థులకు విద్యాదానం చేస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు అభినందనీయులన్నారు. రాబోయే రోజుల్లో మహిళా మండలి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అల్జాపూర్ రేవతి, సభ్యులు డీజే సులోచన, హజారి అనసూయ, అల్జాపూర్ రాజ సులోచన, సాత్ పుతె మంజుల, డీజే యశోద, బారడ్ రమాదేవి, జెస్సు లలిత, బొచ్కర్ వీణ, వైద్య కవిత, బొచ్కర్ సునీత, బాదం సునంద, బారడ్ సింధు, సంతని స్వప్న, పోహార్ రజిని, బాదం రజిని, అల్జాపూర్ చంద్రకళ, శాంతి, వడ్డ సుధా, పడాల్ మంజుల, దోండి లలిత తదితరులు పాల్గొన్నారు.
Spread the love