పట్టణవాసి మధ్యతరగతి కుటుంబానికి చెందిన 32 సంవత్సరాల యువకుడు, ఆర్థిక సమస్యలు అనుభవిస్తూ కూడా ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ , ప్రైవేట్ ఉద్యోగాల మీద ఆధారపడకుండా తన ఉపాధిని తనే స్వయంగా సృష్టించుకుని నేటి యువకులకు ఆదర్శంగా నిలిచిన సుంకం రాంకీ అనే యువకుడిని” ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక” అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు మంగళవారం సన్మానించినారు. శాలువారితో సత్కరించి యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ‘లోయనుంచిశిఖరాని” కి అనే స్ఫూర్తి దాయక పుస్తకాన్ని బహుకరించారు. ముచ్కూర్ దగ్గరి నర్సింగ్ పల్లి నుండి ఆర్మూర్ వచ్చి ఇక్కడే స్థిరపడిన రాంకీ తండ్రి కీ”శే” అంజయ్యకు చిన్న కొడుకు 2015 లో ఎంబీఏ, అంతకు ముందు బీటెక్ చదివి, ప్రైవేట్ ఉద్యోగాల మీద ఆధారపడకూడదని, ఒక దశలో తన ఆరోగ్యం మెరూపంచుకోవడానికి యోగా నేర్చుకున్నాడని తెలిపారు. దానిలో పీజీ. కొరకు హరిద్వార్ వెళ్లి బాబా రాందేవ్ స్థాపించిన ” పతంజలి విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేటర్ పూర్తి చేసిన అనంతరం దానిని వృత్తిగా ఎందుకు స్వీకరించకూడదు అనే ఆలోచనతో యోగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టి క్రమక్రమంగా దానిని ఆన్ లైన్ లో కూడా శిక్షణ ఇవ్వడం ప్రారంభించి అంచలంచలుగా ఎదిగి,గత 6 సంవత్సరాల నుండి ఆన్ లైన్ , ఆఫ్ లైన్ లో దేశ విదేశాలలో ఉన్నవారికి కూడా వారి వారి సమయాను సారంగా రోజుకు 6 గం”లు శిక్షణ ఇస్తూ నెలకు 30 నుండి 40 వేలు సంపాదిస్తున్నారు. తండ్రి అనారోగ్యంతో 2018 చనిపోయినప్పటికీ ధైర్యంగా నిలబడి అనేకమంది ఉద్యోగం లేదని బాధ పడే వారికి ఆదర్శంగా నిలిచాడు.ఎంబీఏ. చదువుకొనే రోజుల్లో కొంతకాలం పార్ట్ టైం జాబ్ గా కోటపాటి దగ్గర హెచ్.పీ గ్యాస్ లో తర్వాత నరేంద్ర డిగ్రీ కళాశాలలో (ఆర్మూర్) లెక్చరర్‌గా పని చేశాడు . ఈరోజుల్లో అనేకమంది యువతి యువకులు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగం రాలేదు అని కాలయాపన చేసే బదులు రాంకీ ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర లోన్ సహకారంతో స్వయం ఉపాధికై ప్రయత్నించాలని కోటపాటి కోరారు. ఆన్ లైన్లో యోగా శిక్షణ కొరకు సంప్రదించాలనుకునే వారు +919491743435 కు లేదా ఇంస్టాగ్రామ్ లో రామ్ కి సుంకం లకు సాంప్రదించగలరు అని చెప్పారు. ఈ సన్మాన కార్యక్రమంలో వారి సన్నిహితులు పాల్గొన్నారు.