జీ2, మిరాయ్, సన్నీడియోల్‌తో హిందీ మూవీ జరుగుతోంది. కన్నడలో గణేష్ అనే యాక్టర్‌తో 50 కోట్ల స్పాన్ ఉన్న మూవీ చేస్తున్నాం. వీటితోపాటు మూడు కన్నడ, నాలుగైదు తెలుగు సినిమాలు వున్నాయి. అలాగే యూఎస్‌లో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. ‘విశ్వం, శ్వాగ్’ రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. ఓటీటీ రిలీజ్‌కి ఓ ఐదు సినిమాలు రెడీగా ఉన్నాయి. ప్రభాస్‌తో చేస్తున్న రాజాసాబ్ షూటింగ్ దాదాపు 50% పైనే పూర్తయింది.
– నిర్మాత టి.జి.విశ్వప్రసాద్
రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ మీడియాతో సంభాషించారు. ఆ విశేషాల సమాహారం..
– రవితేజతో మా బ్యానర్‌లో ఇది మూడవ సినిమా. ఆయనతో సిరీస్ అఫ్ మూవీస్ చేస్తాం. హరీష్ శంకర్‌తో కొంతకాలంగా ట్రావెల్ అవుతున్నాం. రవితేజ, హరీష్‌ది వెరీ క్రేజీ కాంబినేషన్. ఇందులో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎంటర్ టైన్మెంట్, మాస్, యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా ‘మిస్టర్ బచ్చన్’ ధమాకా ప్లస్‌లా ఉంటుంది. ఇది కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్.
– ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడే మే, జూన్ లోగా పూర్తి చేయాలనేది ప్లాన్. ఒరిజినల్‌గా ఈనెల 9 రిలీజ్ డేట్ అనుకున్నాం. అయితే మా సాంగ్స్ షూటింగ్ పూర్తి కాకపోవడంతో మొదట్లో డేట్ ఇవ్వలేదు. ‘పుష్ప2’ స్లాట్ క్లియర్ అవ్వడంతో ఈనెల 15 ది బెస్ట్ అని డేట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 15కి రెండు పెద్ద సినిమాలు ‘మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్’ ఉన్నాయి. ఈ రెండింటికీ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. వీటికి బెటర్ అవుట్ పుట్ ఈ సీజన్‌లో కచ్చితంగా వస్తుంది. లాంగ్ వీకెండ్ ప్లస్ అవుతుంది.
– రవితేజ, హరీష్ శంకర్ వంటి క్రేజీ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఎంత గ్రాండ్‌గా ఉండాలో అంత గ్రాండ్‌గా తీశాం. కొత్త అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవడం అనేది డైరెక్టర్ నిర్ణయం. భాగ్యశ్రీ బోర్సే చాలా చక్కగా నటించారు. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మిక్కీ, హరీష్‌కి ఎక్స్‌ట్రార్డినరీ సింక్ ఉంది. వాలిద్దరూ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ కావాలో అంత గ్రాండ్ అవుట్ పుట్ తీసుకొచ్చారు. పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.