– రూ.3,500 కోట్ల లాభాలు
– మార్చి నాటికి సింగరేణి లక్ష్యం : సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఈ ఏడాది మార్చి నాటికి రూ.40వేల కోట్ల టర్నోవర్, రూ.3,500 కోట్ల లాభాలను ఆర్జించాలని సింగరేణి కాలరీస్ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ లక్ష్యాన్ని నిర్దేశించారు. దీని సాధన కోసం 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించాలనీ, దానికనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. మంగళవారంనాడిక్కడి సింగరేణి భవన్ నుంచి ఆయన అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో బొగ్గు రవాణా లో 12 శాతం, ఉత్పత్తిలో 7శాతం, ఓబీ తొలగింపులో 15 శాతం వృద్ధి సాధిం చినట్టు తెలిపారు. ఇకపై రోజుకు 2.1 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా, 14.65 లక్షల క్యూబిక్ మీటర్ల ఓర్డెన్ తొలగింపు లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. దేశవ్యాప్తంగా బొగ్గుకు డిమాండ్ పెరుగుతున్నదనీ, ఆ అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. డైరెక్టర్లు ఎన్ బలరామ్, డీ సత్యనారా యణరావు, ఎన్వీకే శ్రీనివాస్, జీ వెంకటేశ్వరరెడ్డి, అడ్వయిజర్ (ఫారెస్ట్రీ) సురేం ద్ర పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జే ఆల్విన్ పాల్గొన్నారు.