– మరొకరికి తీవ్రగాయాలు..
నవతెలంగాణ – సారంగాపూర్
రోడ్డుప్రమాదంలో ద్విచక్రవాహనం చెట్టును ఢీ కొని వ్యక్తి మృతి చెండారు. మరొకరికి తీవ్ర గాయాలు అయిన సంఘటన సారంగాపూర్ మండలంలోని చించొలి (బి) గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధని గ్రామానికి చెందిన కొప్పుల సాయన్న, అయిటి మహేందర్ నిర్మల్ వైపు వెళుతున్నారు గ్రామానికి వెళ్తున్నారు. ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు ప్రక్కకు ఆన్న చెట్టును ఢీ కొట్టగా.. సాయన్న అక్కడికక్కడే మృతి చెందారు. మహేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.