
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని బినోల గ్రామంలో శుక్రవారం రాత్రి భూమేష్ భార్య హర్షిత ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి పెంకుటిల్లు పైనుండి రెండు పాములు పడి రెండేళ్ల బాలుడు మంగలి రుద్రాన్ష్ ను కరిచాయి. కరుస్తుండగా బాలుడు ఏడవడంతో తల్లి లేచి పాములను పట్టుకొని విసిరి పారేసింది.చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం 5 గంటలకు మృతి చెందాడు. రెండేళ్ల బాలుడు పాము కాటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. శనివారం రోజు పెంకుటిల్లు సైతం కూలిపోయింది.