యూనిక్‌ లవ్‌స్టోరీ

హీరో సిద్ధార్థ్‌ త్వరలో ‘టక్కర్‌’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్‌ జి.క్రిష్‌ దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, పాషన్‌ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత. దివ్యాంశ కౌశిక్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా జూన్‌ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రొమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సహనిర్మాత వివేక్‌ కూచిబొట్ల మాట్లాడుతూ, ‘మంచి కంటెంట్‌తో ఉన్న ఈ సినిమా సిద్దార్థ్‌కి మళ్ళీ ఆ స్థాయి హిట్‌ అవుతుంది. డైరెక్టర్‌ ఈ సినిమాను చాలా బాగా తీసారు. ఈ సినిమాతో మళ్ళీ మన పాత సిద్దార్థ్‌ని చూస్తాం’ అని తెలిపారు.
‘ఇప్పటివరకు సిద్దార్థ్‌ను మీరొక లవర్‌ బారుగా చేశారు. ఈ సినిమాలో రగ్గడ్‌ లవర్‌ బారుగా చూపించాను. ఈ సినిమా రొటీన్‌గా కాకుండా కొంచెం కొత్తగా ఉండబోతుంది. ఇది న్యూ జనరేషన్‌ సినిమా’ అని దర్శకుడు కార్తిక్‌ జి క్రిష్‌ అన్నారు.
హీరో సిద్దార్థ్‌ మాట్లాడుతూ,’పూర్తి కమర్షియల్‌ సినిమాగా కార్తీక్‌ జి. క్రిష్‌ దీన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో నన్ను కార్తీక్‌ చాలా కొత్తగా చూపించాడు. యాక్షన్‌ అండ్‌ రొమాంటిక్‌ టచ్‌తో ఈ లవ్‌ స్టోరీ నడుస్తుంది. మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుని మరీ ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ చేశాను. 35 రోజుల పాటు యాక్షన్‌ సీన్స్‌ తీశాం. ఈ సినిమాలో దివ్యాంశ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇదొక యూనిక్‌ లవ్‌ స్టోరీ. ఈ జనరేషన్‌కి ఈ లవ్‌ స్టోరీ తప్పకుండా కనెక్ట్‌ అవుతుంది. రాబోయే ఆగస్ట్‌తో 20 ఏండ్ల కెరీర్‌ పూర్తి కావడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తున్నాను’ అని తెలిపారు.

Spread the love