ట్రక్కు​ను ఢీకొట్టిన వ్యాన్.. ఏడుగురు దుర్మరణం

Accidentనవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలో ఆగి ఉన్న ట్రక్కును వ్యాన్​ను ఢీ కొట్టిన ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గుడికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒడిశాలో కెంధూఝర్​లో ఆగి ఉన్న ట్రక్కును ఓ వ్యాన్ ఢీ కొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు ఘటగావ్​ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గంజాంలోని దిగపహండి నుంచి కెంధూఝర్​ జిల్లాలోని ఘటగావ్​లోని తారిణి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వ్యాన్​లో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. మృతులందరూ గంజాం జిల్లాలోని పొడమరి గ్రామానికి చెందిన వారని వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.

Spread the love