రూ. 4.21 లక్షలు పలికిన విల్లా వినాయకుడి లడ్డూ

Rs. 4.21 lakhs
Villa Ganesha Ladduనవతెలంగాణ – హైదరాబాద్‌
వినాయక నిమజ్జనాలు దగ్గర పడుతుండటంతో ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల దగ్గర లడ్డూలను వేలం వేస్తున్నారు. అందులో భాగంగా కొంపల్లి పేట్‌ బషీరాబాద్‌ లోని సన్మాన్‌ ట్రినిటీ విల్లా వినాయకుడి లడ్డు శనివారం రాత్రి జరిగిన వేలంలో రూ. 4.21 లక్షలు పలికింది. ప్రముఖ న్యాయవాది అనుముల నవీన్‌- రూపాదేవి కుటుంబం (విల్లా 15) రూ.4,21,116 లకు వేలం పాడి లడ్డూను సొంతం చేసుకుంది. అదే గణేశుని మెడలో వేసిన కరెన్సీ నోట్ల దండను సైతం వేలం వేయగా మంచి స్పందన వచ్చింది.
పారిశ్రామిక వేత్త రామిరెడ్డి- శ్రీలక్ష్మి కుటుంబం (విల్లా 30) రూ.40,116 లకు ఈ దండను సొంతం చేసుకుంది. కండువాను వేలం వేయగా వ్యాపారవేత్త పద్మారెడ్డి-సిద్ధేశ్వరి కుటుంబం రూ. 18,116 లకు సొంతం చేసుకుంది. వీరికి విల్లా కమిటీ అధ్యక్షుడు రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ పట్నాయక్‌, కోశాధికారి జీతేంద్రనాథ్‌, సభ్యుడు సత్య కిశోర్‌ సహా విల్లా నివాసులందరూ అభినందనలు తెలిపారు.

Spread the love