బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్

amber-is-the-daughter-who-killed-her-father-in-petalaనవతెలంగాణ – అమరావతి
నగరంలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిని గ్రామ వాలంటీర్ హత్య చేశాడు.పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 95వ వార్డు పురుషోత్తపురం పరిధిలో వాలంటీర్‌గా పనిచేస్తున్న వెంకటేష్ హత్య చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. హత్యకు గురయిన వృద్ధురాలు వరలక్ష్మి (73) నిర్వహిస్తున్న షాప్‌లో గత కొంతకాలంగా పార్ట్ టైం వర్కర్‌గా కూడా వాలంటీర్ వెంకటేష్ పనిచేస్తున్నాడు. రాత్రి 10.30 గంటలకు వృద్ధురాలు ఇంట్లో ఉన్న సమయంలో ఆమెను వెంకటేష్ హత్య చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలియడంతో వెంటనే పెందుర్తి పోలీసులు, క్లూస్ టీమ్ ఘటన స్థలానికి చేరుకోని ఆధారాలు సేకరిస్తున్నారు. వృద్ధురాలు ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. వృద్ధురాలిని హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను నిందుతుడు దోచుకెళ్లాడు. పోస్టుమార్టమ్ కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రాత్రి వృద్ధురాలు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్‌ లోపలకు వచ్చి బయటికి వెళ్తున్నట్టు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Spread the love