నడ్డాతో ‘బండి’ భేటీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశమిచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జేపీ నడ్డాను సన్మానించారు. పార్టీ నూతన జాతీయ ప్రధానకార్యదర్శి రాధామోహన్‌ అగర్వాల్‌తో కలిసి 15 నిమిషాల పాటు నడ్డాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జాతీయ నాయకత్వం ఆదేశాల ప్రకారం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని బండి హామీనిచ్చారు. కేంద్రంలో మూడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని హామీనిచ్చారు. పార్టీ హైకమాండ్‌ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధమని నొక్కిచెప్పారు.

Spread the love