కాంగ్రెస్ గ్యారంటీ కార్డు పథకాలను ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర

– మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంటు పరిశీల కురాలు దీపా దాస్ మున్షి..
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : ప్రజలకు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు పథకాలను అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ. హైదరాబాద్ పార్లమెంట్ పరిశీలకురాలు దీపా దాస్ మున్షి అన్నారు. మంగళవారం గన్ ఫౌండ్రీ డివిజన్ లో హనుమాన్ టెక్డి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సి కె మూర్తి ఆధ్వర్యంలో ఆమె పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు కరపత్రాలను ప్రతి ఇంటికి అందిస్తూ  ప్రజలకు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెల 2500, వంట గ్యాస్ సిలిండర్ కు 500, రైతు భరోసా ద్వారా ప్రతి ఏటా 15 వేలు ఎరువులకు. వ్యవసాయ కూలీలకు 12 వేలు , గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 2 00యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం కు 5 లక్షలు, 250 చదరపు ఇంటి స్థలం, యువ వికాసం ద్వారా విద్యార్థులకు ఐదు లక్షలు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్, చేయూత ద్వారా వృద్ధులకు 4 వేలు పింఛన్, రాజు ఆరోగ్యశ్రీ బీమా ద్వారా 10 లక్షలు వైద్యానికి అందిస్తామని ప్రజలకు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు 6 కాంగ్రెస్ గ్యారంటీ కార్డు పథకాలను అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి,గోషామహల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సీకే మూర్తి, చంద్రమోహన్, సంజయ్ కుమార్ యాదవ్, శ్రీధర్ గౌడ్, కన్నయ్య లాల్, బండ అశోక్ కుమార్, మమ్మద్ రషీద్, జహంగీర్, పెద్ద ఎత్తున నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love