శంషాబాద్‌ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం

నవతెలంగాణ – హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని బుధ‌వారం ఉద‌యం శంషాబాద్ అంత‌ర్జాతీయ‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు దాదాపు పది రోజుల పాటు అక్కడే గడిపారు. చంద్రబాబు రాక నేపథ్యంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఘనంగా స్వాగతం పలికారు. కాగా, విశ్రాంతి కోసం ఈనెల 19న చంద్రబాబు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.

Spread the love