– మంచిర్యాల వరకు భారీ ర్యాలీ.
నవతెలంగాణ-దండేపల్లి: కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును ఎన్నికల వహాత్మక కమిటీ చైర్మన్ గా నియమించబడి మొదటిసారి జిల్లాకు వస్తుండగా మండలంలోని గూడెం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాల, శాలువాలతో సత్కరించారు. అనంతరం గూడెంలోని సాయిబాబా అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ర్యాలీతో మంచిర్యాలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పాలనతో ప్రజలు విసుగిపోయారని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమలకు సాధ్యం కాని పథకాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సంక్షేమ పథకాల్లో కూడా ప్రజలపై పక్షపాత వైఖరి చూపెడుతున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని డిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పాలన అదుపు తప్పిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అందుకుగాను పార్టీ నాయకత్వం తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని తెలిపారు. లక్షట్ పేట, హాజీపూర్, మంచిర్యాల మండలాల ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ పూలమాలలు శాలువాతులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.