ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి అడుగున ఘన స్వాగతం..

– ఘజమలలతో సన్మానం..
నవతెలంగాణ – డిచ్ పల్లి
జిల్లా సరిహద్దు నలబై మండలంలోని చంద్రయాన్ పల్లిలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి కి కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు భారీ ఎత్తున అడగడుగున ఘన స్వాగతం పలికారు గ్రామంలో అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.ఇందల్ వాయి టోల్ ప్లాజా వద్ద భారీ గజమాలలు, పూలమాలలు, బోకేలు, శాలువలతో ఘనంగా స్వాగతం పలికారు.తిర్మన్ పల్లి లో మాజీ ఎంపీటీసీ చింతల కిషన్, హబిబ్, మోహ్సిన్ ల అధ్వర్యంలో పులి బొకేలు శాలువాలతో సన్మానించారు జగదాంబ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగపూర్ గేట్ సమీపన ఎన్ఎస్యుఐ యూత్ ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సన్మానించారు వెళ్లిన ప్రతిచోట ప్రజలు తండోపతండాలుగా రహదారులపై వచ్చి జై కొడుతూ వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు కార్లలో ర్యాలీగా బయలుదేరి డిచ్పల్లి స్టేషన్ లో నుండి బస్టాండ్ లో అధికారికంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు అక్కడి నుండి స్టేషన్ నడిపల్లి ధర్మారం తదితరచోట్ల ప్రజలు సన్మానించారు. చంద్రయాన్ పల్లి గ్రామం నుండి బర్దిపూర్ శివారులోని అమృత గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు ప్రచార రథంలోనే ర్యాలీగా బయలుదేరి సమావేశానికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తహెర్ బీన్ హందన్, కాటిపల్లి నాగేష్ రెడ్డి, రాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి, మండలాల అద్యక్షులు అమృత పూర్ గంగాధర్, మోత్కురి నవీన్ గౌడ్, డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్, మోతిలాల్, దత్తు,బోర్వేల్ రాజేందర్ రెడ్డి, పోలసాని శ్రీనివాస్, డాక్టర్ శాదుల్లా,న్యాస రాజేశ్వర్, శ్యాంసన్, గుట్ట గంగాధర్, సుదకర్,అశిశ్, ప్రొఫెసర్ విద్యా సాగర్ రావు రూరల్ నీయోజకవర్గం లోని అన్ని గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపిటిసిలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love