నవతెలంగాణ హైదరాబాద్: శీతాకాల విడిది కోసం హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)కు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్న ఆమె ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆమె తిరిగి ఈ నెల 23న దిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.