చెట్టుకు కారు ఢీకొని మహిళ మృతి

నవతెలంగాణ – నవీపేట్
కారంపొడి తీసుకువచ్చేందుకు ధర్మాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా మండలంలోని జగ్గారావు ఫారం వద్ద చెట్టుకు ఢీకొని మహిళా సులోచన(52) మృతి చెందినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ పట్టణంలోని కోటగల్లికి చెందిన సులోచన భర్త సుదర్శన్ తో పాటు మరో ముగ్గురు అనిత, సునీత, కవిత కారంపొడి తీసుకువచ్చేందుకు ఉదయం మహారాష్ట్ర ధర్మబాద్ కి వెళ్లి తిరిగి వస్తుండగా అతివేగం కారణంగా అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో సులోచన అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కుమారుడు మనిష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Spread the love