నిజామాబాద్ నగరంలోని ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిందని ఆరవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకట్రావు శనివారం తెలిపారు. ఈ మేరకు ఆరవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం..నవిపేట్ మండలం కోస్గి గ్రామానికి చెందిన మ్యాతరి సంగీత
(45) తన భర్త అబ్బయ్య తో కలిసి బైక్ పై నిజామాబాద్ వైపు వెలుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గుర్తు తెలియన వాహనం ఢీకోట్టడంతో సంగీత అక్కడికక్కడే చనిపోయింది. అబ్బయ్య కల్లేదుటే భార్య దుర్మరణం చెందడంతో అతను స్పల్పగాయాలతో బయటపడిన షాక్ నుంచి తెరుకోలేదు. హస్టల్ లో ఉండి చదువుకుంటున్న తన పిల్లలను కలిసేందుకు భార్య భర్తలు వెలుతుండగా ఈ ప్రమాధం జరిగినట్లు తెలిసింది. ఈ మేరకు నగరంలోని 6వటౌన్ పోలిస్ లు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.