బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..మహిళ మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : బాపట్ల జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన వేటపాలెం మండలం పందిళ్లపల్లి బైపాస్‌ రోడ్డులో జరిగింది. వేటపాలెం ఎస్‌ఐ జి.సురేష్‌ కుమార్‌ కథనం ప్రకారం.. బాపట్ల వైపు నుంచి కనిగిరి వెళ్తోన్న కారు అదుపుతప్పి పందిళ్లపల్లి నుంచి చీరాల వైపు వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన శిరీష(29) అక్కడికక్కడే మృతి చెందగా, భర్త టెండూల్కర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరో కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలవ్వడంతో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Spread the love