సంచిలో మహిళ మృతదేహం

A woman's body in a bag– భర్తే హత్య చేసి పారిపోయాడని అనుమానం
నవతెలంగాణ-ఉప్పల్‌
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన జరిగింది. ఓ ఇంట్లో సంచిలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ప్రదీప్‌ బోలా, మధుస్మిత్‌ (28) దంపతులు. వారికి కుమార్తె ఉంది. కొంత కాలంగా ఉప్పల్‌ న్యూ భరత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, శుక్రవారం వారింట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు 100కు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఓ సంచిలో మహిళ మృతదేహం చుట్టి ఉంది.
రెండ్రోజుల కిందటే హత్య జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తనే ఆమెను హత్య చేసి.. కుమార్తెను తీసుకుని వెళ్లిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేసి త్వరలో వివరాలు తెలియజేస్తామని ఉప్పల్‌ సీఐ ఎలక్షన్‌ రెడ్డి తెలిపారు.

Spread the love