భర్త ఇంటిముందు ఇద్దరు పిల్లలతో ఆందోళనకు దిగిన భార్య

నవతెలంగాణ –  ఆర్మూర్  

తన భర్త అరవింద్ కుమార్ ఆచూకీ తెలపాలంటూ బుధవారం ఇద్దరు పిల్లలతో ఆందోళనకు దిగింది భార్య. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో సాత్ పూతే గిర్మాజీ అశ్విని అనే మహిళ భర్త ఇంటి వద్ద బైఠాయించింది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని మూడు సంవత్సరాల నుండి తనను దూరం పెడుతున్నాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని, భర్త ఇంట్లోనే ఉండేందుకు వీలు కల్పించాలని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Spread the love