ఎదకు ఒక గాయం..

విజరు దేవరకొండ, సమంత హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. మనసుకు హత్తుకునే ప్రేమకథతో లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందించారు. సెప్టెంబర్‌ 1న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ అయ్యేందుకు రెడీ అవుతోంది.
రిలీజ్‌ డేట్‌ దగ్గరకు వస్తుండటంతో సినిమా ప్రమోషన్స్‌ ఊపందుకున్నాయి. రీసెంట్‌గా నిర్వహించిన మ్యూజిక్‌ కన్సర్ట్‌ సూపర్‌ రెస్పాన్స్‌ తెచ్చుకుంది.
ఈ కన్సర్ట్‌లో పాల్గొన్న ఆడియెన్స్‌ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా ‘ఖుషి’ నాలుగో పాటను వినిపించారు. ‘ఎదకు ఒక గాయం..’ అంటూ సాగే ఈ లిరికల్‌ సాంగ్‌ను ఐదు భాషల్లో నేటి (గురువారం) సాయంత్రం 6.03 నిమిషాలకు రిలీజ్‌ చేయబోతున్నారు. సినిమాలో లవ్‌ పెయిన్‌ తెలిపే ఎమోషనల్‌ పాటగా దీన్ని చిత్రీకరించారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ఆ అంచనాలను రీచ్‌ అయ్యేలా ఉంటుందనే దీమాతో దర్శక, నిర్మాతలు ఉన్నారు.
జయరాం, సచిన్‌ ఖేడేకర్‌, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్‌ వణ్నన్‌, రోహిణి, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శరణ్య ప్రదీప్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌ :ఉత్తర కుమార్‌, చంద్రిక, ఫైట్స్‌ :పీటర్‌ హెయిన్‌, రచనా సహకారం :నరేష్‌ బాబు.పి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ :దినేష్‌ నరసింహన్‌, ఎడిటర్‌ :ప్రవీణ్‌ పూడి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ :జయశ్రీ లక్ష్మీనారాయణన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ :హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌, సి.ఇ.ఓ :చెర్రీ, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ :జి.మురళి, కొరియోగ్రఫీ : శివ నిర్వాణ, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం :శివ నిర్వాణ.

Spread the love