బాత్‌రూమ్‌లో శవమై తేలిన యువనటుడు..

నవతెలంగాణ-హైదరాబాద్ : బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. నటుడు, మోడల్ ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ బాత్‌రూమ్‌లో శవమై తేలాడు. సోమవారం ముంబయి అంధేరీలోని తన ఇంటిలో విగతజీవిగా కనిపించాడు. అయితే అధిక మొత్తంలో డ్రగ్స్ తీసుకోవడం కారణంగానే మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఢిల్లీకి చెందిన ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత నటుడిగా బాలీవుడ్ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రాంతివీర్, మైనే గాంధీ కో నహిన్ మారా వంటి చిత్రాలలో నటించాడు. అతను దాదాపు 300లకు పైగా అడ్వర్‌టైజ్‌మెంట్స్‌లో కనిపించాడు. స్ప్లిట్స్‌ విల్లా- 9 వంటి రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. లవ్, ఆషికి, కోడ్ రెడ్, ఆవాజ్ సీజన్ 9, బ్యాడ్ బాయ్ సీజన్ -4తో పాటు ఇతర టీవీ షోల్లో కనిపించాడు.

Spread the love