గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా కుప్పకూలిన యువకుడు..

నవతెలంగాణ – హైదరాబాద్: ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా యువకుడికి గుండెపోటు వచ్చింది. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ లోని కేపీహెచ్‌బీలో విషాదం చోటు చేసుకుంది. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా యువకుడికి గుండెపోటు వచ్చింది. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. అస్వస్థతకు గురైన విష్ణువర్ధన్ (31)ను ఆస్పత్రికి తరలించారు భక్తులు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు వైద్యులు. ఈ సంఘటన సంబంధించిన దృశ్యాలు, సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో కేపీహెచ్‌బీలో జరిగిన విషాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love