యువకుడు ఆత్మహత్య

A young man commits suicideనవతెలంగాణ – కంఠేశ్వర్ 

ప్రేమ పేరుతో మోసపోయానంటూ ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో కుమార్ గల్లికి చెందిన సునీల్(22), ఓ యువతిని గతంలో ప్రేమించాడు. అయితే ప్రేమ విఫలమై సోమవారం రాత్రి తన జనరల్ షాపులోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఒకటో టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Spread the love