పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య   

నవతెలంగాణ – శాయంపేట
వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన డబ్బులు భార్య తనకు ఇవ్వలేదని, ఆమెతో మద్యం మత్తులో గొడవ పడి పురుగుల మందు సేవించగా, చికిత్స పొందుతూ యువకుడు ఎడ్లే సుమన్ (36) మరణించినట్లు ఎస్సై సిహెచ్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండలంలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన ఎడ్లే. సుమన్ తన తల్లిదండ్రుల నుండి వారసత్వంగా సంక్రమించిన భూమిని తన అన్న ఎడ్లే అర్జున్ కు 2,50,000 రూపాయలకు అమ్ముకున్నాడు. అందులో ఒక లక్ష రూపాయలు సుమన్ కి ఇవ్వగా, వాటిని మద్యానికి, తన జల్సాలకి వాడుకొని కుటుంబాన్ని పట్టించుకోలేదు. మిగతా రూ.1,50,000 రూపాయలను అర్జున్ ఈనెల 12న తీసుకొని వచ్చి తన మరదలు జ్యోతికి ఇవ్వగా, జ్యోతి తన భర్త  సుమన్ కి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో, సుమన్ భార్యతో గొడవ పడి మద్యం మత్తులో పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు సుమన్ ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి సుమన్ మృతి చెందాడు.  సుమన్ భార్య ఎడ్ల జ్యోతి ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రమోద్ కుమార్ తెలిపారు. సుమన్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Spread the love