పెండ్లి కావట్లేదు అని తుపాకీతో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య

నవతెలంగాణ – బెంగళూరు: ఒ యువకుడు పెళ్లి కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. ఎంత వెతికిన సంబంధాలు కుదరనేలేదు. తీవ్ర ఆవేదనకు గురై ఇక చేసేది ఏమీ లేక తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నాటకలోని కొడగు జిల్లా విరాజ్పేట తాలూకా బోయగిరిలో చోటుచేసుకుంది. దిలీప్ అనే యువకుడు పెళ్లి కాలేదనే బాధతో సోమవారం ఉదయం తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Spread the love