మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య

నవతెలంగాణ – చిన్నకోడూరు

తండ్రిని కొట్టాననే మనస్థాపంతో యువకుడు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నకోడూరు ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మే11 మధ్యాహ్నం తల్లిని కొడుతున్నాడనే సోదరి ఫోన్ చేసి చెప్పగా కోపోద్రిక్తుడైన వల్లేపు శేఖర్(24) హుటాహుటిన ఇంటికి వెళ్ళి తండ్రిని గల్ల పట్టుకొని కొట్టాడు. కానీ కొంత సమయంలోనే తన తండ్రి తప్పు లేదని తెలియగా అనవసరంగా తండ్రిని కొట్టాననే మనస్థాపంతో చంద్లాపూర్ శివారులోని ఓపెన్ జిమ్ వద్ద అదేరోజు రాత్రి సమయంలో విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు సిద్దిపేట లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం అర్ధరాత్రి మరణించాడు. మృతుడి తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Spread the love