యువకుడు ఆత్మహత్య

నవతెలంగాణ – శాయంపేట
కూలి పని చేసుకుని జీవించే యువకుడు అనారో గ్యంతో బాధపడుతుండగా ఆసుపత్రుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగగా, చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు ఎస్సై దేవేందర్‌ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం…. మండలం లోనిపెద్దకోడపాక గ్రామానికి చెందిన మంద. తిరుపతి (39) ఉపాధి లేక పని నిమిత్తం హనుమకొండలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి గత కొన్ని రోజుల నుండి అస్వస్థతగా ఉండడం, ఎముకలలో నీరు రావడంతో హాస్పిటల్‌లో చూపించిన కూడా నయం కాకపోవడంతో మనస్థాపం చెంది శుక్రవారం కూలి పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి స్వగ్రామం పెద్దకోడెపాక గ్రామానికి వచ్చి పురుగుల మందు సేవించాడు. ఇంటి పక్కన వారు చూసి హుటాహుటిన చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్‌ తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించాడు. బాధితుని భార్య మంద.స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Spread the love