ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి..

నవతెలంగాణ – ఆందోల్: ఆర్టీసీ బస్సు-ద్విచక్ర వాహనం ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆందోల్ మండలం అన్నా సాగర్ చెరువు కట్టపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..జూకల్ మండలం కామ్రాజ్ కాలవలి గ్రామానికి చెందిన బట్ట పండరీ (24) తన వాహనంపై జోగిపేట మీదుగా అల్లాదుర్గం వైపు వెళ్తుండగా, నారాయణఖేడ్ నుంచి జోగిపేట వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అన్నాసాగర్ వద్దకు రాగానే ఎదురెదురుగా బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పండరి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్ తెలిపారు.

Spread the love