గడ్డి మందు తాగి యువకుడు మృతి

నవతెలంగాణ-జక్రాన్ పల్లి
గడ్డి మందు తాగి యువకుడు మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. మండలంలోని తొర్లికొండ గ్రామానికి చెందిన మోహన్ కుమారుడు గొల్ల శోబన్(32) అను వ్యక్తి బ్రతుకుదేరువు నిమిత్తం గల్ఫ్ దేశం పోయి వచ్చి, ఇంటి దగ్గర వుంటూ ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేసుకుంటున్నాడు. శనివారం మద్యాహ్నం1 గంటల సమయంలో అతని ఇంటి వద్ద గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతనిని చికిత్స కోసం తరలించగా ముప్కల్ లోని మమత నర్సింగ్ హోం యందు ఆదివారం రాత్రి 10:30 గంటలకు చనిపోయాడు. మృతుని తండ్రి మోహన్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Spread the love