ఘోర రోడ్డు ప్రమాదం..బస్సు కింద పడి యువకుడి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బూర్గంపాడు మండల పరిధిలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొని ద్విచక్రవాహన దారుడు మృతి చెందాడు.  వివరాల్లోకి వెళితే.. పినపాక పట్టి నగర్ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ద్విచక్ర వాహనదారుడు పినపాక పట్టి నగర్ గ్రామంలో వారి బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు కిందపడి ద్విచక్ర వాహనదారుడు ఉల్లోజు అవినాష్ (33) అక్కడికక్కడే మరణించగా, ఆటోలోని వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. మృతుడు పాల్వంచ నటరాజ్ సెంటర్‌కి చెందిన వ్యక్తి. గాయాల పాలైన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బూర్గంపహాడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love