ములుగు జిల్లాలో పిడుగుపడి యువకుడి మృతి

Lightningనవతెలంగాణ – ములుగు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మంగపేట మండలం, కొత్తూరు మొట్లగూడెం గ్రామ పంచాయతీ పరిదిలోని బొమ్మాయిగూడెంలో చోటు చేసుకుది. గ్రామానికి చెందిన ఈసం పవన్ కల్యాణ్ అనే యువకుడు మక్కజొన్న పంటకు కావలికి వెళ్లి రాత్రి భారీ వర్షం కురుస్తుంటే ఇంటికి తిరిగి వస్తుండగా.. పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. పవన్ కల్యాణ్‌ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Spread the love