పిడుగుపాటుతో యువకుడి మృతి

నవతెలంగాణ- సిరిసిల్ల రూరల్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బి వై నగర్ కు చెందిన పడిగే సతీష్ అనే యువకుడు ఆదివారం పిడుగు పడి  మృతి చెందాడు బోనాల సమీపంలో క్రికెట్ ఆడటానికి వెళ్లిన సతీష్ వర్షం వస్తుందని అక్కడే ఉన్న చెట్టు కింద నిలబడటంతో ఒక్కసారిగా పిడుగు చెట్టుపై పడింది సతీష్ కింద పడిపోవడంతో అతని వెంటనే ఆసుపత్రికి తరలించారు అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Spread the love