నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిబట్ల మున్సిపల్ కొంగర కలాన్ లో బైక్ అదుపు తప్పడంతో బైక్ మీదున్న యువకుడు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.