రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

నవతెలంగాణ – బెజ్జంకి
ద్విచక్ర వాహనం అదుపుతప్పి కల్వర్ట్ లోయలో పడిపోవడంతో యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రమాద ఘటన ప్రాంతాన్ని ఎస్ఐ నరేందర్ రెడ్డి సందర్శించి పరిశీలించారు.రోడ్డు ప్రమాద సంఘటన వివరాలను ఎస్ఐ వెల్లడించారు. మండల కేంద్రానికి చెందిన బండిపెల్లి శ్రీనివాస్(25) ద్విచక్ర వాహనంపై ఇంటి నుండి గురువారం సాయంత్రం సమయంలో బయలుదేరి వెళ్లాడు.రాత్రి సమయంలో ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు,స్నేహితులు ఆరా తీశారు.శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలోని గుండారం రోడ్డు మార్గంలో కల్వర్ట్ లోయలో ద్విచక్ర వాహనంపై బండిపెల్లి శ్రీనివాస్ మృతిచెంది ఉండడాన్ని శుక్రవారం తెల్లవారుజామున గ్రామస్తులు గమనించి తల్లిదండ్రులకు సమచారం అందించారు. మృతుని తండ్రి బండిపెల్లి పర్శరాములు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపారు.మృతునికి భార్య రజిత,కూతురు(10 నెలలు) వేదాక్షి ఉన్నారు.

Spread the love