రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం… యువకుడు మృతి

నవతెలంగాణ ముంబై: ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాట్‌ఫారమ్‌-3పై మయాంక్ అనిల్ శర్మ (17) అనే బాలుడు చేతులు కడుక్కుంటున్నాడు. ఆ సమయంలో  వేగంగా వస్తున్న రైలును అతడు గమనించలేదు. దీంతో క్షణాల్లోనే ఊహించని ఘోరం జరిగిపోయింది. ట్రైన్ వేగంగా ఢీకొట్టడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. గత నెల 17న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Spread the love