ఘోర రోడ్డు ప్రమాదం యువకుడి మృతి..

– మరోకరి పరిస్థితి విషమం.. ఒకరికి తివ్ర గాయాలు..
నవతెలంగాణ- డిచ్ పల్లి
ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44 వ జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద యూనియన్ బ్యాంక్ ముందర ఆగివున్న డీసీఎం ను దేవి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఎత్తుతండా నుండి ఇందల్ వాయి మండల కేంద్రానికి ద్విచక్ర వాహనం పై వస్తున్న అతివేగంతో వచ్చి డీసీఎం ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులకు తివ్ర గాయాలయ్యాయి.విరిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి కి అంత్హంగ్ టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గమధ్యంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై నరేష్ తెలిపారు.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఎత్తుతండాకు చెందిన బాధవత్ నితిన్, బాధవత్ ప్రవీణ్, దెగవాథ్ రాము ముగ్గురు కలిసి ఒక ద్విచక్ర వాహనంపై ఇందల్ వాయి మండల కేంద్రం కు వస్తుండగా మార్గమధ్యంలోని టోల్ ప్లాజా వద్ద రోడ్డు పక్కన ఆగిఉన్న ఒక డిసిఎంను వెనుక వైపునుండి వేగంగా ఢీ కోనడంతో ముందు ఉన్న రామ్ 22 తోపాటు ఇతరులకు తివ్ర గాయాలైనట్లు వారు వివరించారు. లిపిలో ముందు మధ్య లో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. విరీద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హూటహూటిన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఒక ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యంలో ఒకరు మృతి చెందినట్లు వారు తెలిపారు. ఇంకోక్కరి పరిస్థితి విషమంగా ఉందని, ఇంకోక్కరికి తివ్ర గాయాలైనట్లు వారు వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో పేద్ద శబ్దం రావడంతో చుట్టూ పక్కల ఉన్న వారు గుమి గుడి గాయాల పాలైన వారికి బైటికి తీసి వారి ఫోన్ ద్వారానే కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.విషయం తేలు సుకున్నా పోలిసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన డిసిఎంను ద్విచక్ర వాహనన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించినట్లు తెలిపారు. తండాలో అందరితో కలిసి మెలిసి ఉండే రాము ప్రమాదం మృతి చేందడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాము కు గతేడాది వివాహం జరిగిందని, ప్రస్తుతం రాము భార్య గర్భవతిగా ఉందని కోరుతోంది. కోన్ని రోజుల్లో పండంటి బిడ్డను చుడకుండానే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు.

 

Spread the love