ఈతకొడుతూ బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన యువకుడు

నవతెలంగాణ -తిరుపతి: తిరుపతి పర్యాటకప్రాంతమైన తలకోన జలపాతంలో ఈత కొడుతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. సుమంత్‌ తలభాగం బండరాళ్లతో చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎర్రవారిపాలెం పోలీసులు శుక్రవారం రాత్రి వరకు సుమంత్‌ను బయటికి తీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చీకటిపడటంతో శనివారం ఉదయం వెలికితీస్తామన్నారు. ఈ రోజు ఉదయం పోలీసులు సుమంత్‌ మృతదేహాన్ని వెలికితీశారు. కాగా తలకోనలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ ముగ్గురు యువకులు జలపాతంలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

Spread the love