పురుగులు ముందు తాగి యువతి ఆత్మహత్యాయత్నం

నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పాత జయరాం తాండకు చెందిన కేతావత్ పాండుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యాకు ఇద్దరు కూతుర్లు వారి వివాహలు జరిగాయి. 22 ఏళ్ల క్రితం కేతావత్ పాండు రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్యకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అయితే గత రెండేళ్లుగా ఇద్దరి భార్యల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం ఏమి జరిగిందో ఏమో కానీ రెండవ భార్య కూతురు ఇంటర్ పూర్తి చేసింది. ఆమె అవి వాహితురాలు (20) ఏళ్లు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే నాగార్జున సాగర్ కమలా నెహ్రు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love