ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

– ఎమ్మెల్యే వేధింపులే కారణం?
న్యూఢిల్లీ : ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ప్రాంగణంలో మంచిర్యాలకు చెందిన ఆరిజిన్‌ డెయిరీ సీఈఓ బోడపాటి షేజల్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన తెలంగాణ భవన్‌ సిబ్బంది ఆమెను ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అం దిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిసింది. షేజల్‌ గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోప ణలు చేస్తున్న విషయం తెలిసిందే. మానసికంగా, లైంగికంగా ఎమ్మెల్యే చిన్నయ్య వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. రెండ్రోజుల క్రితం ఢిల్లీలోని మహిళా కమిషన్‌, మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్సీ)ని కూడా కలిసి ఫిర్యాదు చేసింది. చంపుతానని ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. తనపై తప్పుడు కేసులు పెట్టించి భయాందోళనకు గురి చేస్తున్నాడని వివరించింది. దీనిపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉన్నదనీ, రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరింది. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నాడనీ, తనకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తానని షేజల్‌ తెలిపింది.

Spread the love