నవతెలంగాణ – ఝార్ఖండ్
ఎత్తు తక్కువగా ఉన్న కారణంగా ఇప్పటికి మూడు పెళ్లి సంబంధాలు తప్పిపోయాయన్న బెంగతో ఝార్ఖండ్‌లోని రాంచీ సమీప పుండగ్ పోలీస్‌స్టేషను పరిధిలో శ్వేత (22) అనే యువతి ఆత్మహత్య చేసుకొంది. మూడు సందర్భాల్లోనూ చివరిదాకా వచ్చి, కేవలం తాను పొట్టిగా ఉన్న కారణంగా సంబంధాలు వెనక్కు వెళ్లిపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. కుటుంబసభ్యులు ఎంతగా నచ్చజెప్పినా ఆ బాధలో నుంచి శ్వేత కోలుకోలేకపోయింది. తల్లిదండ్రులు బిహార్‌లోని అరవల్‌లో ఉంటారు. అక్క శిల్పతో కలిసి శ్వేత ఇక్కడ ఉంటోంది. కుటుంబ పని మీద గురువారం రాత్రి తాను బయటకు వెళ్లానని, పొరుగింటి వ్యక్తులు ఫోను చేసి శ్వేత ఆత్మహత్య గురించి చెప్పినట్లు శిల్ప తెలిపింది. పోలీసులు శ్వేత మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.