ప్రియుడు పెండ్లికి నిరాకరించాడని.. యువతి ఆత్మహత్య

నవతెలంగాణ – నవీపేట: నిజామాబాద్‌ నవీపేటలో విషాదం నెలకొంది. ఇంట్లో ఉరి వేసుకుని హరిణి(25) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పెండ్లికి నిరాకరించాడని మనస్తాపానికి గురైన ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ మేరకు యువతి తండ్రి సదరు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Spread the love