ANTHE 2024 ను ప్రారంభించిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ ( AESL)

– భావి తరపు డాక్టర్ కలాం, డాక్టర్ హెచ్ జి ఖోరానా, డాక్టర్ ఎం ఎస్ స్వామినాథన్,సర్ జె సి బోస్ లను కనుగొనే ప్రయత్నంలో  ANTHE 2024 ను ప్రారంభించిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ ( AESL)

– AESLయొక్క జాతీయ స్కాలర్‌షిప్ పరీక్ష, ANTHE,  అక్టోబర్ 19- 27, 2024 వరకూ ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది

– రిజిస్ట్రేషన్లు తెరిచి ఉన్నాయి.విద్యార్థులు/తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో anthe.aakash.ac.inలో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా వారి నగరంలో  సమీపంలోని ఆకాష్ కేంద్రాన్ని సందర్శించవచ్చు.

న‌వ‌తెలంగాణ‌-నెల్లూరు : ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ పరీక్ష ANTHE ప్రారంభించి 15 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకోవటంను గుర్తుచేసుకుంటూ, టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసెస్‌లో అగ్రగామి అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL), విద్యార్థులు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ (ANTHE) 2024 యొక్క తాజా ఎడిషన్‌ను నెల్లూరు లో  ప్రారంభించింది. నెల్లూరులో జరిగిన ఈ కార్యక్రమంలో  శ్రీ  కె.ఎస్.ఆర్.ఎస్. సుబ్రమణ్యం (అసిస్టెంట్  డైరెక్టర్- అకడమిక్స్), శ్రీ  వి. అర్జున్ (ఏరియా ఆపరేషన్స్ హెడ్) & శ్రీ  ఎస్. రాజశేఖర్ (బ్రాంచ్ మేనేజర్, నెల్లూరు) పాల్గొన్నారు.

VII-XII తరగతి విద్యార్థులకు గణనీయమైన నగదు అవార్డులతో పాటు 100% స్కాలర్‌షిప్‌లను పొందే అవకాశాన్ని ANTHE  అందిస్తుంది,  ఈ సంవత్సరం,  అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు అత్యుత్తమ విద్యార్థుల కోసం యుఎస్ఏ లోని ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు 5-రోజుల అన్ని ఖర్చులు-చెల్లింపుతో కూడిన పర్యటనను అందిస్తున్నారు.

ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL) యొక్క సీఈఓ,ఎండి  శ్రీ  దీపక్ మెహ్రోత్రా మాట్లాడుతూ  “ విద్యార్థుల ఆకాంక్షలు , సామర్థ్యాల మధ్య అంతరాన్ని తగ్గించడంలో ANTHE కీలక పాత్ర పోషిస్తుంది.  ANTHE 2024తో, మేము భవిష్యత్ వైద్యులు,ఇంజనీర్‌లను పెంపొందించడానికి,శాస్త్ర, సాంకేతిక,  ఇంజనీరింగ్, గణితం రంగంలో భారతదేశం గర్వించేలా మార్గదర్శకత్వం వహించే తదుపరి APJ అబ్దుల్ కలాం, HG ఖోరానా, MS స్వామినాథన్ , JC బోస్‌ల కోసం శోధించడానికి జాతీయ ప్రతిభ శోధనను ప్రారంభిస్తున్నాము” అని అన్నారు.

  ANTHE 2024 అక్టోబర్ 19-27, 2024 మధ్య ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ మోడ్‌లలో జరుగుతుంది. ANTHE ఆఫ్‌లైన్ పరీక్షలు 2024 అక్టోబర్ 20, 27 తేదీలలో దేశవ్యాప్తంగా ఆకాష్ ఇన్‌స్టిట్యూట్‌లోని 315+ కేంద్రాలలో నిర్వహించబడతాయి, అయితే ఆన్‌లైన్ పరీక్షలను అక్టోబర్ 19 నుంచి 27, 2024 వరకు ఎగ్జామ్ విండో సమయంలో   విద్యార్థులు తమకు అనుకూలమైన ఒక గంట స్లాట్‌ను ఎంచుకోవచ్చు.

ANTHE 2024 కోసం ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఆన్‌లైన్ పరీక్ష ప్రారంభానికి మూడు రోజుల ముందు, ఆఫ్‌లైన్ పరీక్షకు ఏడు రోజుల ముందు ఉంటుంది . ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ విధానాలు  రెండింటికీ పరీక్ష రుసుము రూ. 200. విద్యార్థులు 15 ఆగస్ట్ 2024లోపు నమోదు చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజులో ఫ్లాట్ 50% తగ్గింపును కూడా పొందవచ్చు

Spread the love