లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆప్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలోని వివిధ లోక్‌సభ స్థానాలకు పోటీపడబోయే ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆప్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్‌ మంగళవారం మధ్యాహ్నం ఒక ప్రకటన చేశారు. ఏ నియోజకవర్గంలో ఎవరూ పోటీ పడబోతున్నారో వెల్లడించారు. ఆ జాబితా ప్రకారం.. తూర్పు ఢిల్లీ స్థానం నుంచి కుల్దీప్‌ కుమార్‌, న్యూఢిల్లీ నుంచి సోమ్‌నాథ్‌ భారతి, దక్షిణ ఢిల్లీ నుంచి సాహీరామ్‌ పహిల్వాన్‌, పశ్చిమ ఢిల్లీ నుంచి మహాబల్‌ మిశ్రా ఆప్‌ తరఫున బరిలో దిగబోతున్నారు. హర్యానాలో కూడా ఒక లోక్‌సభ స్థానానికి ఆప్‌ అభ్యర్థిని గోపాల్‌ రాయ్‌ ప్రకటించారు. కురుక్షేత్ర నుంచి సుశీల్‌ గుప్తా బరిలో దిగనున్నారు.

Spread the love