ఏబీసీడీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

– ఎంఎస్‌పీ మంచాల మండల ఇన్‌చార్జి కాళ్ళ పాండు మాదిగ
– ఎంఎస్‌పీ, ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
నవతెలంగాణ-మంచాల
ఎంఎస్‌పీల ఏబీసీడీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి చట్టబద్దత కల్పించాలని ఎంఎస్‌పీ మండల ఇన్‌చార్జి కాళ్ళ పాండు మాదిగ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న ఆయన మీడియా తో మాట్లాడుతూ ఈ నెల 10 వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నట్టు వివరించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీలను ఏబీసీడీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, చట్టబద్ధత కల్పి స్తామనీ, హామీనిచ్చిన కేంద్ర, బీజేపీ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టి చట్ట బద్ధత కల్పించే విధంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, వామపక్ష పార్టీలు పార్లమెంట్‌ సభ్యులు బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. బీజేపీ ప్రభు త్వం కూడా ఎస్సీ మాదిగ ఉపకులాల సంబంధించిన ఏబీసీడీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టి చట్ట బద్దత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎస్‌పీ మండల ఇన్‌చార్జి కందికంటి ఆనంద్‌ మాదిగ, బరిగల గురువయ్య, గ్యార జ్యోతి, అరుణ, ప్రేమలత తదితరులు ఉన్నారు.

Spread the love