అభిషేక్ శర్మ విధ్వంసం.. 28 బంతుల్లోనే సెంచరీ

Destruction by Abhishek Sharma.. Century in 28 ballsనవతెలంగాణ – హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ దుమ్మురేపారు. మేఘాలయతో జరిగిన టీ20లో కేవలం 29 బంతుల్లోనే 106 రన్స్ చేశారు. 28 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నారు. అభిషేక్ శర్మ ఇన్నింగ్సులో 11 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. టీ20ల్లో భారత బ్యాటర్లకు ఇదే జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ. అంతకుముందు గుజరాత్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ ఈ ఏడాది నవంబర్ లో 28 బంతుల్లోనే సెంచరీ చేశారు.

Spread the love