సీతారామాంజనేయ విగ్రహ అభిషేకం

నవతెలంగాణ – మాక్లూర్

మండల కేంద్రంలో శ్రీ లక్ష్మణా సహిత సీతారామాంజనేయ  విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మూడవరోజు విగ్రహ అభిషేకం నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాలా గణేష్ గుప్త అధ్వర్యంలో బుదవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో విగ్రహాల కు జాలాదివాసం నుంచి తీసి విగ్రహబిషేకం చేశారు. అనంతరం ధాన్యది వాసంలో ఉంచారు. సాయంకాలం మహిళలతో కుంకుమార్చన చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళలు, యువకులు, గ్రామ కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Spread the love