నవతెలంగాణ – సుల్తాన్ బజార్
ఎన్నికల నేపథ్యంలో క్యూ అర్ టి బలగాలతో కలిసి ఫ్లాంగ్ మార్చ్ నిర్వహించారు. అదనపు డిసిపి, అబిడ్స్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ టి నరసింహారాజు ఆధ్వర్యంలో జిపిఓ చౌరస్తా నుంచి మహేష్ నగర్, గన్ ఫౌండ్రి, షేర్ గేట్ ,అగర్వాల్ ఛాంబర్స్, కింగ్ కోఠి, ఫర్ ద గేట్, కింగ్ కోఠి, అగర్వాల్ ఛాంబర్స్, తాజ్ మహల్ హోటల్, మీదుగా జిపిఓ వరకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఆనంద్, ఏసిపి చంద్రశేఖర్, ఇన్ స్పెక్టర్ టి నరసింహారాజు,అబిడ్స్, బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో డిఐలు, ఎస్ఐలు, పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.